సంపూ హృదయాన్ని కొల్లగొట్టిన సలోని..

Update: 2018-07-15 03:07 GMT

రాజమౌళి మర్యాద రామన్న సినిమాలో నటించి మెప్పించిన సలోనికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. ఆ సినిమా తరువాత అడపా దడపా సినిమాలు చేసిన అవి నిరాశపరిచాయి.  అందం, అభినయంతో యువ హృదయాలను కవ్వించినా.. అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా  చేస్తోంది. అయితే హీరోయిన్ గా కెరీర్ ను నిలబెట్టుకోవాలన్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఈ క్రమంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పక్కన హీరోయిన్‌గా సలోనీకి అదృష్టం వరించింది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వినోదం నేపథ్యంలో  తెరకెక్కుతోందట..  స్టార్ ఇమేజిని పక్కనబెట్టి  ఏ సినిమా అయితేనేం చెయ్యడానికి అన్నట్టు సంపూ సినిమా ఒప్పుకుందట. దీంతో మరోసారి హీరోయిన్ గా  ప్రేక్షకుల్ని మైమరిపించడానికి సిద్ధమైంది సలోని. ఇదిలావుంటే ప్రస్తుతం సంపూ హృదయాన్ని కొల్లగొట్టిన సలోని ఫేట్ ఈ సినిమా తోనైనా మారుతుందో లేదో  వేచి చూడాలి.

Similar News