ఖమ్మం జిల్లాలో వింత...గుడ్లు పెడుతున్న కోడిపుంజు

Update: 2018-04-21 07:24 GMT

అవును.. కోడిపుంజు గుడ్డుపెట్టిన అరుదైన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆలస్యం శ్రీనివాసరావు ఇంట్లో ఓ కోడిపుంజు చిన్నగా ఉన్న గుడ్డు పెట్టింది. గత నెలలోనూ తోలు గుడ్డు ఒకటి పెట్టిందని, అది దానిదా? కాదా? అనే సందేహంతో ఈసారి పుంజును విడిగా పెట్టడంతో నిర్ధరణ అయిందని ఆయన చెప్పారు. ఇక దీనిని పరిశీలించిన వెటర్నరీ డాక్టర్ కె. కిశోర్.. జన్యు పరివర్తనాల వల్ల ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయని తెలిపారు. కోడిపుంజు పెట్టే గుడ్డును విండ్‌ గుడ్డు అని, మొదటిసారి పెంకు లేకుండా పెట్టే గుడ్డును పుల్లెట్ గుడ్డు అని అంటారని తెలిపారు. ఇలా పెట్టే గుడ్డులో పచ్చసొన ఉండదని, ఇవి పునరుత్పత్తికి పనికిరావని కిషోర్‌ వివరించారు.


 

Similar News