“మమ్మల్ని బతకనివ్వండి.. మీరూ బతకండి”

Update: 2018-04-30 06:08 GMT

కాస్టింగ్ కౌచ్ గొడవల నుంచి మొదలు పెట్టి.. పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి తిట్ల వరకూ.. ఈ మధ్య సినిమా రంగం బాగా డిస్టబ్ అయ్యింది. కొన్ని వేదికలపై యువ హీరోలు.. ఆ విషయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ.. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. నిన్న జరిగిన నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఇదే విషయంపై నర్మగర్భంగా ప్రస్తావించాడు.

సినిమా ఇండస్ట్రీ అయినా.. మీడియా అయినా.. ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయన్న చెర్రీ.. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఈ మధ్య బాగా పెరిగిపోయిందని అన్నాడు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే.. దాన్ని చూపించడం కూడా ఇంకా తప్పుగా చెప్పాడు. అలాంటివాటికి ఎవరూ స్పందించాల్సిన అవసరం కూడా లేదన్నాడు.

అదే సమయంలో.. సినిమా ఇండస్ట్రీలో అవినీతి అన్నది ఏ మాత్రం లేదన్న చరణ్.. రోజూ ఉదయాన్నే 5 గంటలకు లేచి షూటింగ్ కు హాజరై.. ఎంతో కష్టపడుతుంటామని.. ఇక్కడ ఎక్కడ అవినీతి ఉందో చూపించాలని అన్నాడు. తమను బతకనివ్వాలని.. అలాగే.. మీడియా కూడా బతకాలని పిలుపునిచ్చాడు.

తన మాటలతో.. కాస్త మెచ్చూర్డ్ గా మాట్లాడినట్టు కనిపించిన చెర్రీకి.. తన కుటుంబంపై కొందరు చేసిన కామెంట్లపై బాగానే మనసు నొచ్చుకునేలా చేసి ఉంటాయని అనలిస్టులు అంటున్నారు.

Similar News