దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ బయోపిక్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ గా ఆయన తనయుడు నటుడు బాలకృష్ణ నటిస్తున్నారు.దాదాపుగా ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక పూర్తయింది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్న సంగతి తెలిసిందే. యువ ఎన్టీఆర్‌కు జోడిగా రకుల్ జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రంలో కీలకం అవనున్నట్టు సమాచారం.