రాజ్యసభ రేపటికి వాయిదా

Update: 2018-03-21 06:28 GMT

పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమైన 30 సెకన్లపై లోక్‌సభ ఆందోళనల మధ్య వాయిదా పడటంతో రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పెద్దల సభలోనూ ఎంపీలు ఆందోళన సాగడంతో చైర్మన్ వెంకయ్య నాయుడు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విపక్షాల ఆందోళనతో సభ వాయిదా వేయడం జరిగింది.

ఈరోజు ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కావేరీ బోర్డు అంశంపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై తెరాస సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్‌ తమ స్థానంలో ఆసీనులు కాగానే సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ వారించినా వారు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

ఇక రాజ్యసభలోనూ అదే తంతు కొనసాగింది. వివిధ అంశాలపై సభ్యులు ఆందోళన చేయగా వారిని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వారించారు. అన్ని అంశాలపై చర్చిద్దామని.. సభ్యులు శాంతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు.

Similar News