అలజడి సృష్టించిన కొండ చిలువ‌..నాలుగు కోళ్లను మింగి..

Update: 2018-08-20 13:28 GMT

ఓ కొండచిలువ గ్రామంలో అలజడి సృష్టించింది. మేత మేస్తున్న నాలుగు కోళ్లను మింగి తచ్చాడింది .ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండవల్లి గ్రామంలోకి తెల్లవారిజామున వచ్చిన ఓ కొండ చిలువ వచ్చింది. రాగానే ఓ ఇంటిముందు తిరుగుతూ.. అక్కడ ఉన్న నాలుగు కోళ్లను మింగేసింది. ఈ క్రమంలో కొన్ని కోళ్ళ కొండచిలువను చూసి కొక్కొరొక్కో అంటూ అరవడం మొదలుపెట్టాయి. దాంతో ఇంట్లోని వ్యక్తులు బయటకు చూశారు. అంతే ఒక్కసారిగా కొండచిలువను చూసి షాక్‌కు గురయ్యారు. కోళ్ళను మింగిన కొండచిలువ వాటిని బయటకు ఉమ్మి వేయడం చూసి వారు భయాందోళనకు గురయ్యారు. తర్వాత అతికష్టం మీద దాన్ని మట్టుబెట్టారు గ్రామస్థులు. 

Similar News