సోనియా ట్విస్ట్.. బీజేపీ ఆశలు నీరుగారినట్టేనా?

Update: 2018-05-15 10:26 GMT

  కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ట్విస్ట్ ఇచ్చారు. జేడీఎస్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామితో ఫోనులో మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ అందుకు సహకరించమని కోరారు.. కావాలంటే కర్ణాటక సీఎం పదవి తీసుకోమని కుమారస్వామికి   సోనియా గాంధీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది..ఈ మేరకు సోనియా మాటలను గులాం నబీ ఆజాద్ దృవీకరించారు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా  అధికారంలోకి రాకపోయినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకూడదన్న కారణంతోనే సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకుననట్టు అయన తెలిపారు. దీంతో అధికారం చేపట్టాలని భావించిన బీజేపీ ఆశలపై నీళ్లు చల్లారు సోనియా గాంధీ. ప్రస్తుతమున్న ట్రెండ్స్‌ ప్రకారం చూసుకుంటే.. కాంగ్రెస్‌కు 77 స్థానాలు, జేడీఎస్‌కు 39 స్థానాలు  ఆధిక్యంలో ఉంది. బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ముందంజలో ఉంది. కానీ ఆ పార్టీ మెజారిటీ మార్కుకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ జేడీఎస్‌ సాయంతో బీజేపీకి అధికారం దక్కకుండా పావులు కదుపుతోంది.

Similar News