ముఖ్యమంత్రిపై మాజీ సీఎస్ షాకింగ్ కామెంట్స్!

Update: 2018-06-03 11:34 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడుపై మాజీ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు  షాకింగ్ కామెంట్స్ చేశారు. మూడు నెలల కిందట నటుడు శివాజీ  చేసిన ఆరోపణ (ఆపరేషన్ గరుడ )కు సూత్రదారులు మీరేనని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'ఆపరేషన్ గరుడ కు తమరే నిర్మాత దర్శకులు రచయిత.ఒక నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనచే పలికించారు. ఈరోజు నవనిర్మాణ దీక్ష లో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చనిసెలవిచ్చారు. ఏమి ఐడియా  సాబ్జీ' అంటూ కృష్ణారావు సీఎంపై వ్యాఖ్యలు చేశారు. 

Similar News