తొమ్మిదేళ్ల బాలిక అపూర్వ సాహసం...బావిలో పడిన సోదరిని కాపాడిన బాలిక

Update: 2018-06-18 06:10 GMT

ఎవరైనా బావిలో పడితే కాపాడండి .. కాపాడండి అని అరవడం కామన్‌గా మనం చూస్తుంటాం. కాని ఆ తొమ్మిదేళ్ల బాలిక తన సోదరిని కాపాడుకునేందుకు ఎవరి కోసం చూడలేదు.  వయస్సులో చిన్నదైన  ... సమయానికి స్పందించింది. క్లిష్ట సమయంలో బుద్ధిబలంతో పాటు భుజబలం ఉపయోగించి  సోదరిని రక్షించుకుంది. బావిలో పడిన  సోదరిని కాపాడుకునేందుకు  అపూర్వ సాహసం చేసింది.  

ఒడిశాలోని  సువర్ణపూర్‌ జిల్లా కెందుముండా గ్రామానికి చెందిన  మూడేళ్ల మిల్లీ ,  తొమ్మిదేళ్ల జిల్లీ తోటి స్నేహితురాలితో కలిసి ఊరి బయటున్న తోటలో ఆడుకుంటున్నారు. ఇంతలో మూడేళ్ల  మిల్లీ అనుకోకుండా బావిలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన జిల్లీ  గ్రామస్తులను తీసుకురమ్మంటూ స్నేహితులకు  చెప్పి  బావిలో దూకింది.  నీళ్లలో మునిగిపోతున్న  సోదరిని పైకి ఎత్తుకుని నీళ్లలో అలాగే నిలబడింది. ఇంతలో అక్కడకు చేరుకున్న గ్రామస్ధులు గంప ద్వారా ఇద్దరినీ బయటకు తీశారు.  బావిలో పడిన మిల్లీని పరీక్షించిన వైద్యులు ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో  తల్లిదండ్రులతో పాటు స్ధానికులు ఆనందం వ్యక్తం చేశారు.  25 అడుగుల లోతు బావిలో దూకి చెల్లలిని కాపాడిన జిల్లీపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.  

 

Similar News