ఎవర్ని కుట్టాలో దోమలకే తెలుసంట

Update: 2018-01-29 06:32 GMT

పగలు రాత్రి తేడా లేకుండా దోమల స్వైరవిహారం పెరిగిపోతోంది. డెంగీ, చికెన్ గున్యా, మలేరియా లాంటి రోగాలను వ్యాప్తికి దోమలే ప్రధాన కారణం. దోమలు కొంత మందినే ఎక్కువగా కుడుతుంటాయి. ఐదారుగురు కూర్చుని ఉన్నప్పుడు వారిలో ఏ ఒకరో, ఇద్దరో మాత్రం దోమలు తెగ కుడుతున్నాయంటూ గోల పెడుతుంటారు. అలా పదేపదే కొందరినే కుట్టడానికి ప్రత్యేక కారణాలున్నాయంటున్నాయి పరిశోధనలు. 

బృందంగా ఒకచోట కూర్చున్న మనుషుల్లో.. దోమలు కొందరినే ఎక్కువగా కుడుతుంటాయని ఎప్పుడైనా గమనించారా?. అలా పదేపదే కొందరినే ఎక్కువగా కుట్టడానికి ప్రత్యేక కారణాలున్నాయంట. ఎవర్ని కుట్టాలి?, మళ్లీ అదే వ్యక్తి రక్తం పీల్చడం ఎలా? అనేది దోమలు చాలా వేగంగా నేర్చుకుంటాయంట. ఇందుకు వాటి మెదడులో ఉన్న డోపమైన్‌ అనే రసాయనమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. . ఎవర్ని కుట్టాలి...? మళ్లీ అదే వ్యక్తి రక్తం పీల్చడం ఎలా..? అనేది దోమలు చాలా వేగంగా నేర్చుకుంటాయని ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఎవర్ని కుట్టాలనే విషయంలో సీనియర్ ఆడదోమలు జూనియర్ దోమలకు శిక్షణ కూడా ఇస్తాయంటున్నారు పరిశోధకులు.

న్యూరాన్‌ కణాల మధ్య సంకేతాలను పంపించడానికి, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి ఈ డోపమైన్‌ ఉపయోగపడుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా ఎవర్ని కుట్టాలో నిర్ణయించుకునే ప్రక్రియలో భాగంగా ఏడిస్‌ ఈజిప్ట్‌ అనే ఆడదోమలు జూనియర్‌ దోమలకు శిక్షణ కూడా ఇస్తాయంట. అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ఈ విషయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వివరాలు ‘కరెంట్‌ బయాలజీ’ అనే జర్నల్‌లో కూడా ప్రచురితమయ్యాయి. 

Similar News