నాగాలాండ్‌లో పాగా వేసేదెవరు?

Update: 2018-03-03 03:30 GMT

నాగాలాండ్‌లో నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 2003 నుంచి అధికారంలో ఉంది. 2013 ఎన్నికల్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ... నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 38 స్థానాలు సాధించి అధికారం చేపట్టింది. అయితే ప్రస్తుతం అధికారం BJP-NDPP కూటమికే ఎగ్జిట్‌పోల్స్ ఓటేశాయి. మెజార్టీ స్థానాలు BJP-NDPP కూటమికి వస్తాయని అంటున్నాయి.  జన్‌కీబాత్-న్యూస్ ఎక్స్ ప్రకారం... BJP-NDPP కూటమికి  27 నుంచి 32 సీట్లు వస్తాయని అలాగే.. అధికార NPF ‌కు 20 నుంచి 25 సీట్లు , కాంగ్రెస్‌కు 3 స్థానాలు వచ్చే అవకాశముంది. ఇక సీ ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌...BJP-NDPP కూటమికి 25 నుంచి 31స్థానాలు...NPF కు 19 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశముంది.

Similar News