ఊహించని మలుపు తిరిగిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస పరీక్ష
బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మరో మలుపు తిరిగింది. అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు ఓటింగ్ జరగాల్సి ఉండగా చైర్పర్సన్ సునీతరాణి తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా కలెక్టర్‌ను స్వయంగా కలిసిన ఆమె తన రాజీనామాను అందజేశారు. అయితే రాజీనామా ఆమోదం పొందకపోవడంతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించారు. సమావేశంలో చైర్పర్సన్ రాజీనామాను ఆమోదిస్తే ఓటింగ్ రద్దు చేయాలని లేని పక్షంలో ఓటింగ్ నిర్వహించాలని కలెక్టర్ భావిస్తున్నారు. దీంతో సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని క్యాంపుల్లో బసచేసిన కార్పోరేటర్లు బెల్లంపల్లి చేరుకున్నారు.