నిరసనల హోరు ; లోక్‌సభ సోమవారానికి వాయిదా

Update: 2018-03-09 07:36 GMT

పార్లమెంటు ఉభయ సభలు ఇవాళ కూడా ప్రత్యేక హోదా అంశం కారణంగా దద్దరిల్లాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం నినదించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వెల్ లోకి దూసుకెళ్ళి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో లోక్ సభ సోమవారానికి రాజ్యసభ మధ్యాహ్నం రెండున్నరకి వాయిదా పడ్డాయి. 

లోక్‌సభలో వరుసగా ఐదోరోజూ వాయిదాల పర్వం కొనసాగింది. ఇవాళ సభ ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు రిజర్వేషన్ల కోటా అంశంపై టీఆర్ఎస్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా తర్వాత కూడా సభలో అదే పరిస్థితి కొనసాగింది. సేవ్ ఏపీ అంటూ ఏపీ ఎంపీలు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యుల ఆందోళన నడుమే సభను నడిపించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ యత్నించారు. అయినా పలితం లేకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.

Similar News