మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ ఎమ్మెల్యే

Update: 2018-09-23 08:26 GMT

మావోయిస్టుల చేతిలో ప్రభుత్వ  విప్, అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. అరకులోయ డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది.   ఆదివారం ఎమ్మెల్యే గ్రూపుపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో కిడారి సర్వేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ నిర్ధారించారు. కాగా ఈ దాడిలో కిడారి సర్వేశ్వరరావు గన్మెన్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. సర్వేశ్వరరావు 2014 సాధారణ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది. అనంతరం టీడీపీలో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.  మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే గన్మెన్ల వద్దనున్న తుపాకులను ఎత్తుకెళ్లినట్టు కూడా తెలుస్తోంది.  కాగా ఎమ్మెల్యేను హతమార్చిన మావోయిస్టులను వెతికేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News