ముందస్తుగానే ఎన్నికలు.. లీక్ చేసిన 'నోమురా'

Update: 2018-06-05 02:48 GMT

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం ఉండగానే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశముందని సుప్రసిద్ధ ప్రపంచ ద్రవ్య వ్యవహారాల నిర్వహణ 'నోమురా' సంస్థ తెలిపింది. ఈ క్రమంలో  ఈఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి లో సార్వత్రిక సమరం జరగబోతుందంటూ సంచలన విషయం బయటబెట్టింది. దీనికి కారణం ఇటీవల జరిగిన ఉపఎన్నికలేనని స్పష్టంచేసింది. మోడీ ప్రభుత్వం క్రమంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని తద్వారా ముందస్తుగానే ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చనే అభిప్రాయంలో  బీజేపీ అగ్రనేతలు ఉన్నట్టు పేర్కొంది. అంతేకాకుండా  ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ ‘సంస్కరణలు’ దేశీయ ఉత్పత్తుల విలువలో ఏర్పడే ద్రవ్యలోటును భర్తీ చేసుకోగల స్థితిలో కూడా లేవని 'నొమూరా' సంస్థ విశ్లేషించింది. 

Similar News