ఆ అడ్డు లేకుండా చూడు దేవుడా.. ఆ శాఖ మాకే కావాలి : కుమారస్వామి

Update: 2018-05-21 05:58 GMT

బుధవారం కర్ణాటక 23 వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయనున్న సందర్బంగా హసన్‌లోని లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏ అడ్డు లేకుండా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించేలా దేవుడి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా ప్రభుత్వ ఏర్పాటు విషయమై ఇవాళ (సోమవారం) కాంగ్రెస్  అధినాయకురాలు సోనియాగాంధి, అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కుమారస్వామి భేటీ అవుతారు. భేటీలో మంత్రివర్గ కూర్పు, ఎవరికెన్ని పదవులు అనే అంశంపై వారితో చర్చిస్తారు.  ఇదిలావుంటే కీలకమైన హోంశాఖ కూడా తమ పార్టీకే కావాలని కుమారస్వామి కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత తాజామాజీ మంత్రి డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు ఆయనకే హోంశాఖ కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ పదవిపై కర్ణాటక పిసిసి అధ్యక్షుడు పరమేశ్వర కూడా ఆశలు పెట్టుకున్నారు. తనకు హోంశాఖ ఇవ్వకపోయినా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తే చాలన్న అభిప్రాయంలో పరమేశ్వర ఉన్నట్టు సమాచారం. 

Similar News