కొండా సురేఖకు ఝలక్ ఇచ్చిన కేసీఆర్

Update: 2018-09-07 06:08 GMT

తెలంగాణ అసెంబ్లీ రద్దు రోజే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ప్రత్యర్ధి పార్టీలకు అందనంత దూకుడుగా అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్.. కీలకమైన, సున్నితమైన కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఆంధోల్, చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాబు మోహన్., నల్లాల ఓదెలుకు టికెట్ ఖరారు చేయలేదు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రాతినిద్యం వహిస్తున్న హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనూ అభ్యర్దులను ఖరారు చేయలేదు. 

వరంగల్ తూర్పు నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు ఝలక్ ఇచ్చారు సీఎం కేసీఆర్. సెటిలర్స్ ఓటుబ్యాంకు ఎక్కువగా ఉండే మల్కాజ్ గిరి స్థానంలో అభ్యర్థిని ప్రకటించలేదు.  మేడ్చల్, వరంగల్, వికారాబాద్, చొప్పదండి, వికారాబాద్ స్థానాలను పెండింగ్ లో ఉంచారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తొలి జాబితాలో అవకాశం కల్పించలేదు.

Similar News