ఈనెల 6 న మంత్రివర్గ విస్తరణ!

Update: 2018-06-02 01:59 GMT

మిత్రధర్మాన్ని పాటిస్తూ  ఎట్టకేలకు ఇరుపార్టీలు ఏకాబిప్రాయాన్ని  కుదుర్చుకున్నాయి. దాదాపు 15 రోజుల నిరీక్షణకు ఈ నెల 6 న ముగింపు పలకబోతున్నాయి కర్ణాటక కాంగ్రెస్ మరియు, జేడీఎస్ పార్టీలు. కాంగ్రెస్ కు డిప్యూటీ సీఎంతో కలిపి 21 మంత్రి పదవులు దక్కనున్నాయి.ఇక జేడీఎస్ కు 12 మంత్రి పదవులతో సరిపెట్టుకున్నారు.. కీలకమైన హోమ్, భారీనీటిపారుదల శాఖలు కాంగ్రెస్ తీసుకోగా. జేడీఎస్ కు ఆర్ధిక, వ్యవసాయ, మానవవనరులు, మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి, సహకార సంఘాలు తోపాటు చిన్న  నీటిపారుదలశాఖలు దక్కేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 

కాంగ్రెస్ కు దక్కేవి..
హోం, రెవెన్యూ, భారీనీటిపారుదల, విద్య, వైద్యం, ఆరోగ్యం,గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, అటవీ–పర్యావరణం, పరిశ్రమలు, కార్మిక, గనులు, భూ విజ్ఞాన శాస్త్రం మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. వీటితోపాటు మహిళా–శిశు సంక్షేమం, ఆహార–పౌర సరఫరాలు, హజ్, వక్ఫ్,  బెంగళూరు నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, మైనారిటీ వ్యవహారాలు, న్యాయ,  విజ్ఞాన సాంకేతికత, సమాచార సాంకేతికత, యువజన–క్రీడలు, కన్నడ సంస్కృతి శాఖలు కాంగ్రెస్‌ తీసుకుంది. 

Similar News