అసలే మంగళవారం.. అనుకున్నదంతా అయింది!

Update: 2018-05-16 04:55 GMT

వ్రతం ఒకరిది వ్రతఫలం ఇంకొకరిది అన్నట్టు తయారైంది కర్ణాటక బీజేపీ పరిస్థితి. మెజారిటీ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారానికి ఆమడదూరంలో నిలిచిపోయింది. ఇంకాస్త కష్టపడితే బాగుండు అని అనుకునేంతగా  బీజేపీ నేతలే చర్చించుకుంటున్నారు.. పాస్ మార్కులు కూడా సాధించలేని జేడీఎస్ ప్రస్తుతం కింగ్ మేకరైంది.. ఇంకా చెప్పాలంటే కింగ్ అయింది. అధికార కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు దక్కకపోవడంతో జేడీఎస్ తో కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఫిక్స్ అయింది. అయితే  కాంగ్రెస్ ప్రతిపాదనను జేడీఎస్ అధినేత దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ తోసిపుచ్చుతున్నారు. ఆలా జరగాలంటే నేనే సీఎం అని వారికీ అల్టిమేటం జారీ చేసారంట. దీంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న కుమారస్వామికి మొండి చేయి చూపడం.. లేదా అతన్ని కూడా డిప్యూటీ సీఎంను చేయడం. డిప్యూటీ సీఎంపై  కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఒకే కుటుంబానికి, అదీ కూడా సొంత పార్టీని కాదని జేడీఎస్  వారికే కీలక పదవులు కట్టబెట్టడం బహుశా కాంగ్రెస్ లోని కొందరి నేతలకు ఇష్టం ఉండకపోవచ్చు. దీంతో ఆ పార్టీకి రెబల్ బెడద ఏర్పడే ప్రమాదం ఉంది.

ఇదిలావుంటే అధికారం కోసం ఆశపడి ఆమడ దూరంలో నిలిచిపోయిన బీజేపీ పరిస్థితి అయితే మరీ ఘోరం.. 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటకు మరో 8 మంది ఎమ్మెలేలు అవసరం. జేడీఎస్ లోని చీలిక వర్గమైన రేవణ్ణ అతని మద్దతుదారులైన 12 మంది శాసనసభ్యులు  మాకు సహకరిస్తారని బీజేపీ సీఎం అబ్యర్ధి యడ్యూరప్ప చెబుతున్నారు.. కానీ ఫైనల్ గా రేవణ్ణ ఎంతవరకు బీజేపీ వైపు నిలబడతారోనని ఆసక్తి నెలకొంది.అయితే  దీనికి అంతటికి కారణం మంగళవారం..  అంట. ఫలితాల తేదిని మార్చాలని  బీజేపీ మొదటి నుంచి కోరుకుంది.. కానీ ఎలక్షన్ కమిషన్  వారి అబ్యర్ధనను పట్టించుకోలేదు.. ఈ తరుణంలో మంగళవారం మంచిది కాదన్న  అభిప్రాయం ఏర్పడింది.దీంతో  మూడనమ్మకాలను ఎక్కువగా విశ్వసించే బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప తొలి రోజు నుంచే దోషనివారణ పూజలు చేయడం మొదలు పెట్టారు.కౌంటింగ్ రోజు కూడా దాదాపు రెండు గంటలకు పైగా దోష నివారణ పూజలను యడ్యూరప్ప చేసినట్లు సమాచారం. ఇంత చేసినా పక్క పార్టీ సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Similar News