పాక్‌పై భారత్‌ ఘనవిజయం

Update: 2018-09-20 04:24 GMT

ఆసియాకప్‌లో టీమిండియా ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చింది. హాంకాంగ్‌పై చెమటోడ్చి గెలిచిన భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మాత్రం అదరగొట్టింది. తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా ముగించేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ పూర్తిగా దెబ్బతింది. భారీస్కోర్ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచుదామనుకున్న పాక్‌కు భువనేశ్వర్‌, కేదార్ జాదవ్ భారీ షాకిచ్చారు. బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ 43.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాక్‌ బ్యాట్స్‌మన్లలో బాబర్‌ ఆజమ్‌ 47(62 బంతులు), షోయబ్‌ మాలిక్‌43(67 బంతులు)లు రాణించారు. కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌లు చెరో మూడు వికెట్లు, బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఎలాంటి తడబాటుకు గురికాకుండా టార్గెట్‌ను 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. రోహిత్‌ శర్మ52(39 బంతులు), ధావన్‌46(54 బంతులు), రాయుడు31 నాటౌట్‌(46 బంతులు), కార్తీక్‌31 నాటౌట్‌(37 బంతులు) రాణించారు.

Similar News