నైరుతి ఎఫెక్ట్‌... భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం

Update: 2018-06-07 06:58 GMT

నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయి.  తొలకరి జల్లులు హైదరాబాద్‌ ను పలకరించాయి. బుధవారం  రాత్రి నుంచి చిరుజల్లులు హైదరాబాద్‌లో కురవడంతో వాతావరణం చల్లబడింది. వాతావణంలో వచ్చిన ఈ మార్పును నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వేసవి తాపంతో అల్లాడిపోయిన జనం వాతావరణం చల్లబడడంతో పరవశించిపోతున్నారు.  నాటికి రాయలసీమలోని అత్యధిక ప్రాంతాలు, కోస్తాలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వరకు రుతుపవనాలు వ్యాపించాయి. మహారాష్ట్ర నుంచి కేరళ వరకూ తీరం వెంబడి ద్రోణి, మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం వేర్వేరుగా కొనసాగుతున్నాయి. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులూ పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా పలుచోట్ల పిడుగులు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 

Similar News