హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

Update: 2018-05-03 10:52 GMT

హైదరాబాద్‌లో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు మండినా.. ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, మియాపూర్, కూకట్‌పల్లి, దిల్‌షుక్‌ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. సచివాలయం పరిసరాలు కూడా తడిసిముద్దయ్యాయి. రహదారులన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు తిరుమలగిరిలో.. రోడ్డుపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈదురు గాలులతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. భారీ వర్షం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
 

Similar News