కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణం

Update: 2018-05-23 11:22 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామితో ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. కుమారస్వామి వయసు 59.. బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన.. 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి.. 2006లోనూ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్‌ వజుభాయ్‌ వాలా కుమారస్వామి, పరమేశ్వరతో ప్రమాణ స్వీకారం చేయించారు. కన్నడలో ప్రమాణ స్వీకార పత్రాన్ని కుమారస్వామి చదివి వినిపించారు. బుధవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, శరద్‌ యాదవ్‌, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌ రెడ్డి, అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌ పవార్‌, తదితర కీలక నేతలు కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
 

Similar News