'చిరూ'ను కలిసిన టాప్ షూటర్..

Update: 2018-11-01 13:27 GMT

మెగాస్టార్‌ చిరంజీవితో టాప్ షూటర్‌ గగన్‌ నారంగ్‌ భేటీ అయ్యారు.  చిరుతో కాసేపు అయన  మాట్లాడారు. మెగాస్టార్ ను కలిసిన విషయాన్నీ గగన్ నారంగ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. చిరూతో చిత్ర విశేషాలు, 'సైరా' నరసింహారెడ్డి సినిమా  షూటింగ్‌కు సంబంధించిన విషయాలను మాట్లాడినట్టు తెలిపారు. 

ఇదిలావుంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అయన స్వాతంత్ర సమరయోధుడిగా నటిస్తున్నందున... గగన్‌ నారంగ్‌  వద్ద షూటింగ్‌కు సంబంధించిన మెలుకువల గురించి చర్చించినట్టు సమాచారం. ఇటీవలె జార్జియా షెడ్యుల్‌ను కంప్లీట్‌ చేసుకుంది చిత్రయూనిట్‌. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తుండగా..  విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, సుధీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Similar News