నేటినుంచి ఫుట్‌బాల్‌ మహా సంగ్రామం!

Update: 2018-06-14 02:24 GMT

నేటినుంచి ఫుట్‌బాల్‌ ఫిఫా వరల్డ్ కప్ ఆరంభం కానుంది. అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకక వేదిక సిద్ధమైంది.  12 మైదానాలు... 11 నగరాల్లో ఫుట్‌బాల్‌ మహా సంగ్రామం జరగనుంది.. నేడు రష్యా, సౌదీ అరేబియా మధ్య తొలి పోరు జరగనుంది. 88 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో, 20 ప్రపంచ కప్‌లలో పదుల సంఖ్యలో జట్లు తలపడినా ఇప్పటివరకు విజేతలుగా నిలిచింది మాత్రం బ్రెజిల్‌ (5 సార్లు), జర్మనీ, ఇటలీ (4సార్లు), అర్జెంటీనా, ఉరుగ్వే (2సార్లు), స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ (ఒక్కోసారి) గెలుపొందింది. గత ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా... ఈసారి పావ్‌లో దిబాలా వంటి ప్రతిభావంతులతో బరిలో దిగుతోంది.  డేవిడ్‌ సిల్వా, ఆండ్రెస్‌ ఇనెస్టా వంటి అనుభవజ్ఞులున్న స్పెయిన్‌... గ్రీజ్‌మన్, ఎంబాపె స్థాయి ఉన్నత శ్రేణి ఆటగాళ్లతో ఫ్రాన్స్‌ పటిష్ఠంగా కనిపిస్తున్నాయి.బ్రెజిల్‌... స్టార్‌ స్ట్రయికర్‌ నెమార్‌నే నమ్ముకుంది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లయిన డిబ్రుయెన్, హజార్డ్, మెర్టెన్స్‌ల పైనే బెల్జియం ఆధారపడింది. ఇక క్రిస్టియానో రొనాల్డో ఆధ్వర్యంలోని పోర్చుగల్ పటిష్టంగా ఉంది.

Similar News