ఏపీలో ఎంపీ సీట్లకు ఉపఎన్నికలు నిర్వహించకపోవడంపై ఈసీ వివరణ

Update: 2018-10-09 08:43 GMT

కర్ణాటకలో లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం..ఏపీలో ఖాళీ అయిన ఎంపీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఏపీలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంపై మీడియాలో కథనాలకు సీఈసీ వివరణ ఇచ్చింది.  ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు మాత్రమే 6 నెలల్లోగా ఉపఎన్నికలు నిర్వహించాలని ఈసీ తెలిపింది. కర్ణాటకలో 3 లోక్ సభ సీట్లు మే 21 నాటికే ఖాళీ అయ్యాయని అదే ఆంధ్రప్రదేశ్‌లోని 5 లోక్‌సభ స్థానాలు మాత్రం జూన్ 20న ఖాళీ అయ్యాయని తెలిపింది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్ 3 వరకు మాత్రమే ఉండడంతో నిబంధనల ప్రకారం ఉప ఎన్నికల ఏడాది సమయం తగ్గిందని తెలిపింది. 

Similar News