కాంగ్రెస్ కు సైలెంట్ గా సైడైపోవాల్సిన పరిస్థితి!

Update: 2018-05-22 11:26 GMT

కర్ణాటకలో బిజేపియేతర సర్కార్ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గాసాగుతున్నాయి. దక్షిణాదిన  బిజెపిని దిగ్విజయంగా అడ్డుకున్న  కాంగ్రెస్, జేడిఎస్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలవుతున్నాయి. కుమారస్వామి సిఎంగా ప్రమాణం చేస్తుండగా కీలక శాఖలన్నీ జేడిఎస్ గుప్పిట్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ కు డిప్యూటీ సిఎం సహా కొన్ని శాఖలు ఇచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ సీట్లొచ్చినా.. జేడిఎస్ పెత్తనం చెలాయిస్తుంటే.. మెజారిటీ సీట్లుండి కాంగ్రెస్ సైలెంట్ గా సైడైపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రేపు అనగా బుధవారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక 23 వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కర్ణాటకలో జేడీఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణస్వీకారానికి తెలుగురాష్ట్రాల సీఎంలతోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ , అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశముంది. ఎన్నడూ లేని విధంగా అన్ని దక్షిణాది ప్రాంతీయ పార్టీల నేతలు, ఆప్, బిఎస్పీ, ఎస్పీ సహా అందరూ ఈ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరవుతున్నారు.

Similar News