టీఆర్ఎస్‌లో విలీనం చేయండి: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

Update: 2018-12-21 06:33 GMT

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్‌ తగలనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోకముందే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీని వీడి, కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు శాసనమండలి సభ్యులు హస్తానికి హ్యాండ్‌ ఇవ్వనున్నారు. టీఆర్‌ఎస్ లో చేరేందుకు ఆకుల లలిత, సంతోష్‌ కుమార్‌ సిద్ధమయ్యారు. అక్కడితో ఆగకుండా, హస్తం పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థులు ఏకంగా కాంగ్రెస్ ను, టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ మండలి ఛైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. 

ఉదయం కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్, ప్రభాకర్, దామోదర్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ను కలిశారు. కాంగ్రెస్ శాసన మండలి పక్షాన్ని, టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దామోదర్ రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. ఆకుల లలిత, సంతోష్ కుమార్ నిన్న ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిశారు. వీరిద్దరు కూడా త్వరలోనే గులాబీ గూటీకి చేరేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని, టీఆర్ఎస్ లో విలీనం చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. 

Similar News