ఈ చర్చలు ప్రారంభం మాత్రమే

Update: 2018-03-19 12:23 GMT

ఫెడరల్ ఫ్రంట్‌ నాయకత్వాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుందని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రెండు గంటల పాటు ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించారు కేసీఆర్‌. ఈ చర్చలు ప్రారంభం మాత్రమేనన్న కేసీఆర్‌...కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతామన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరముందని స్పష్టం చేశారు.  ప్రజల అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. అయితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ తప్ప దేశానికి దేశాన్ని పాలించింది ఎవరని సీఎం అన్నారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గుణాత్మక మార్పు కోసం తొలి అడుగుపడిందని చెప్పారు. ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ పార్టీల కోసం కాదు. ప్రజల కోసమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

దేశం మార్పు కోరుకుంటోందని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. 2019లో థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేసీఆర్‌తో చర్చించామన్న మమతా దేశాభివృద్ధి, రైతు సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. బలమైన ఫెడరల్ ఫ్రంట్‌ కోరుకుంటున్నామన్న మమతా దేశంలో ఒకే పార్టీ అధికారంలో కొనసాగకూడదని స్పష్టం చేశారు. 

Similar News