అగ్రకుల అధికారులు vs దళిత అధికారులు

Update: 2017-12-21 16:08 GMT

 ఏపీ భవన్‌ సాక్షిగా కులోన్మాదం బయటపడింది. దళిత, అగ్రకుల అధికారులుగా ఏపీ భవన్ చీలిపోయింది. అధికారుల వాట్సప్‌ గ్రూప్‌లో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అగ్రకుల అధికారుల తీరుపై దళిత అధికారి ఆనందరావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తనకు పదోన్నతి దక్కకుండా అగ్రకుల అధికారులు కుట్రచేసి అడ్డుకున్నారని ఏపీ భవన్‌ దళిత అధికారి ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు. 3 సహాయ కమిషనర్‌ పోస్టులు మంజూరైతే.... వాటిని రెండుకు కుదించేలా అగ్రకుల అధికారులు కుట్ర చేయడతో తనకు పదోన్నతి దక్కకుండా పోయిందని అధికారుల వాట్సప్‌ గ్రూప్‌లో ఆనందరావు మెసేజ్‌ పెట్టారు. అయితే ఆనందరావు మెసేజ్‌పై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సూర్యనారాయణ.... ప్రాప్తం లేనప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదంటూ కౌంటర్‌ ఇచ్చారు. అంతేకాదు దళితులను రాక్షసులతో పోల్చారు. క్షీరసాగర మధనంలో రాక్షసులు ఎంత కష్టపడ్డా.... ప్రాప్తం దక్కలేదంటూ డిప్యూటీ కమిషనర్ సూర్యనారాయణ ఎద్దేవా చేస్తూ మెసేజ్‌ చేశారు. సూర్యనారాయణ మెసేజ్‌తో దళిత ఉద్యోగులు తీవ్ర మనస్తాపం చెందారు. డిప్యూటీ కమిషనర్ సూర్యనారాయణపై దళిత అధికారి ఆనందరావు ఢిల్లీ తిలక్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Similar News