నేడే ఉపఎన్నికల ఫలితాలు.. టెన్షన్ లో బీజేపీ!

Update: 2018-05-31 04:08 GMT

వివిధ రాష్ట్రాల్లో జరిగిన 14ఉపఎన్నికల ఫలితాలు నేడు(గురువారం)వెలువడనున్నాయి.సాయంత్రానికల్లా తుది ఫలితాలు వెల్లడించనున్నట్టు ఎలక్షన్ కమిసన్ అధికారులు తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 4 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరిగాయి.. అన్ని స్థానాల్లో కంటేకూడా యూపీలోని కైరానా స్థానం ఉప ఎన్నిక మాత్రం బీజేపీ వర్గాలను టెన్షన్ కు గురిచేస్తోంది. కైరానాలో బీజేపీ ఎంపీ హుకుమ్‌ సింగ్‌ మృతి చెందడంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఇక్కడ ఆయన కుమార్తె మ్రిగాంకా సింగ్‌ పోటీ పడగా.. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ మద్దతుతో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి హసన్‌ ఆమెకు గట్టి పోటీ ఇచ్చారు. దీంతో గెలుపు ఎవరివైపు వుటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలావుంటే రెండు నెలల కిందట ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్, ఫుల్పూర్‌‌ నియోజకవర్గాల్లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురుకావడంతో ఎలాగైనా ఈసారివిజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఈ ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటమి తప్పదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.  

Similar News