బీరు బాటిళ్లతో బుద్ధుడి ఆలయం!

Update: 2018-05-29 07:14 GMT

మాములుగా దేవుడి ఆలయాన్ని సిమెంట్ , ఇసుకతోపాటు ఇటుకల సహాయంతో నిర్మిస్తారు.. ఓల్డెన్ డేస్ లో అయితే  చెక్కలు లేదా మట్టితో కడతారు కానీ చిత్రంగా బుద్ధుడి గుడిని బీరు బాటిళ్లతో నిర్మించారు. ఇందుకోసం బుద్ధుడి భక్తులే  స్వయంగా పాల్గొన్నారు. బ్యాంకాక్‌ లోని సిసాకెట్‌ ప్రొవిన్స్‌లోని ‘వాట్‌ పా మహా చెది కయూ’ అనే బుద్ధుడి ఆలయం ఉంది.దీన్ని1984లో నిర్మించారు. సిసాకెట్‌ ప్రొవిన్స్‌కి  అరకిలోమీటరు దూరంలో   సముద్రతీరప్రాంతం ఉంది. అక్కడ(1984)లో లక్షల కొద్ది బీరు బాటిళ్లు దొరికాయి వాటిని ఏమి చేయాలా అని ఆలోచించగా తమ ఇష్టదైవం అయిన బుద్దుడికి గుడి కట్టాలనే ఆలోచన తట్టింది. ఇక అంతే  అనుకున్నదే తడవుగా  ఈ ఆలయాన్ని నిర్మించారు  . ఇందుకుగాను మొత్తం 10 లక్షల బీరు బాటిళ్లను సేకరించారు. ఆలయ ప్రాంగణంతోపాటు, మెట్లు, నేల, వాష్‌రూమ్‌లు, విశ్రాంతి గది ఇలా అన్నీ బీర్‌ సీసాలతో నిర్మించినవే. 

Similar News