యడ్యూరప్పకు మరో ఎదురుదెబ్బ.. జేడీఎస్ శిబిరంలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే!

Update: 2018-05-18 09:10 GMT

నిన్న (గురువారం) సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై రేపు అసెంబ్లీలో బలపరీక్ష ఏర్పాటు చెయ్యాలని సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పిన సంగతి మరవకముందే. బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. హసన్ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ప్రీతమ్ గౌడ JDS శిబిరంలో చేరిపోయారు.104 సీట్లు గెలిచి అతిపెద్దపార్టీగా అవతరించిన బీజేపీ  తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం JDS పార్టీని చీలుస్తుందని అంతా భావించారు. ఈ క్రమంలో కుమారస్వామి అన్న రేవణ్నకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తారని.. ఆయన 12 మంది ఎమ్మెల్యేలతో కాషాయం గూటికి చేరుతారని ప్రచారం జరిగింది. కానీ.. అదే JDS ఇప్పుడు బీజేపీకి గండి గొట్టింది. ప్రస్తుతానికి ప్రీతమ్‌ గౌడ.. గోడదూకినా.. రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎటు జంప్ చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
 

Similar News