అవిశ్వాసానికి భయపడుతున్న కేంద్రం

Update: 2018-03-28 05:35 GMT

లోక్‌‌సభ ముందుకు ఎనిమిదోసారి అవిశ్వాస తీర్మానాలు రాబోతున్నాయి. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఇప్పటికే  అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని లోక్‌ సభ సెక్రటరీ జనరల్ కు అందచేశాయి. అయితే ఇవాళ కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు. కావేరి బోర్డు ఏర్పాటు గురించి కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే ఎంపీలు ఇక ముందు కూడా ఆందోళనలు విరమించేది లేదని తెగేసి చెప్పేశారు. దీంతో అవిశ్వాసంపై చర్చ జరగడం అసాధ్యంగానే కనిపిస్తోంది. మరోవైపు అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి మోడీ సర్కారు భయపడుతున్నట్లు సమాచారం. ఒక వేళ అవిశ్వాసంపై చర్చ జరిగితే వచ్చే నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు..ఈ ఏడాది జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్..చత్తీస్‌గఢ్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసంపై చర్చ జరపకుండా వాయిదా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
 

Similar News