హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి..

Update: 2018-11-20 02:38 GMT

హైదరాబాద్ లోని మెట్టుగూడలో నిన్న( సోమవారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  అతివేగంగా కారణంగా బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లా పనిగిరి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు బైక్‌పై(నంబర్‌ టీఎస్‌08 ఎఫ్‌టీ 6841) వెళుతున్నారు. ఈ క్రమంలో అతివేగం కారణంగా మెట్టుగూడ మూలమలుపు వద్ద ఉన్న డివైడర్ ను అంచనా వేయలేకపోయారు. దాంతో వేగంగా దూసుకొచ్చిన బైక్‌ మెట్టుగూడలోని మెట్రో పిల్లర్‌ 9 వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయ్‌, పృథ్వీ, ఉదయ్‌రెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలానికి చేరుకున్న  పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతి వేగం కారణంగానే ప్రమాదం చోటుచుసుకుందని పోలీసులు భావిస్తున్నారు. 

Similar News