Apple Valentines Day Sale India: యాపిల్ వాలెంటైన్స్ డే సేల్.. ఐఫోన్, మ్యాక్‌బుక్‌పై బెస్ట్ ఆఫర్లు
Apple Valentines Day Sale India: యాపిల్ వాలెంటైన్స్ డే సేల్ ఇండియాలో ప్రారంభం. ఐఫోన్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లపై బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Apple Valentines Day Sale India: యాపిల్ వాలెంటైన్స్ డే సేల్.. ఐఫోన్, మ్యాక్‌బుక్‌పై బెస్ట్ ఆఫర్లు
Apple Valentines Day Sale India: వాలెంటైన్స్ డే సందర్భంగా యాపిల్ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ప్రేమజంటలు, గిఫ్ట్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్పెషల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ డీల్స్ లైవ్‌లో ఉన్నాయి. సాధారణంగా అధిక ధరలతో ఉండే యాపిల్ ఉత్పత్తులపై ఈసారి నేరుగా ధరలు తగ్గించకుండా, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా రాయితీలు అందిస్తోంది.
ఈ సేల్‌లో ముఖ్యంగా iPhone 17 సిరీస్ మోడళ్లపై బ్యాంక్ ఆఫర్లు వర్తిస్తున్నాయి. iPhone 17 Pro, Pro Max మోడళ్ల కొనుగోలుపై రూ.5,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అలాగే iPhone 17 Air మోడల్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 11, Apple Watch SE 3 మోడళ్లపై కూడా ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్లు అందిస్తున్నారు.
మ్యాక్‌బుక్ వినియోగదారులకు కూడా ఈ సేల్‌లో మంచి ప్రయోజనం ఉంది. M4 చిప్‌తో వచ్చిన MacBook Air, MacBook Pro మోడళ్లపై రూ.10,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ప్రకటించారు. 14 అంగుళాలు, 16 అంగుళాల MacBook Pro వేరియంట్లపై కూడా ఆఫర్లు వర్తిస్తున్నాయి. స్టూడెంట్లు, ప్రొఫెషనల్స్ కోసం ఇవి లాభదాయకంగా ఉండనున్నాయి.
ఈ ఆఫర్లు పొందాలంటే ICICI బ్యాంక్, Axis బ్యాంక్ లేదా American Express కార్డులతో చెల్లింపు చేయాలి. చెక్‌అవుట్ సమయంలో కార్డ్ వివరాలు నమోదు చేసిన వెంటనే క్యాష్‌బ్యాక్ అప్లై అవుతుంది. దీంతో వినియోగదారులకు తక్షణ ధర తగ్గింపు లభిస్తుంది. యాపిల్ ఆడియో యాక్సెసరీస్‌పై కూడా కొన్ని ఎంపిక చేసిన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.