భారీ రికార్డు సాధించిన అల్లు అర్జున్ 'సరైనోడు'

Update: 2018-07-16 14:31 GMT

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ 'సరైనోడు'  యూట్యూబ్ లో భారీ రికార్డ్‌ నమోదుచేసింది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా   హిందీ డబ్బింగ్‌ వర్షన్‌కు యూట్యూబ్‌లో 2 కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. దీంతో యూట్యూబ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చలనచిత్రంగా సరైనోడు నిలిచింది. కాగా ఈ చిత్ర  హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ను 2017 మే 28న గోల్డ్‌ మైన్స్‌ టెలిఫిలింస్‌ సంస్థ తమ యూట్యూబ్‌ చానల్‌ లో పోస్ట్ చేసింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ లు హీరోయిన్లుగా నటించారు. 

Similar News