చడీ చప్పుడు లేకుండా చార్జెస్.. లేదంటే మీ సిమ్ లాకే..

Update: 2018-11-30 12:52 GMT

టెలికాం దిగ్గజం జియో దెబ్బకు ఇతర నెట్ వర్క్ లు అన్ని నష్టాల  బాటపడుతున్నాయి. దాంతో ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులకు చడీ చప్పుడు లేకుండా సందేశాలు పంపిస్తూ వారి దగ్గర ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నాయి. నెల నెలా.. ప్రీపెయిడ్ వినియోగదారులు కనీస రీచార్జి చేసుకోవాలనే అన్ని టెలికాం సంస్థలు షరతులు విధిస్తున్నాయి. ఒకవేళ అలా రీఛార్జ్ చేసుకోకపోతే ప్రస్తుతం అమలవుతున్న జీవితకాల ఇన్ కమింగ్ తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. స్పెషల్ రీఛార్జ్ చేసుకొని పక్షంలో నెల రోజుల తరువాత అవుట్ గోయింగ్ కాల్స్, 45 రోజుల తరువాత ఇన్ కమింగ్ కాల్స్ నిలిచిపోతాయి. అయితే అప్పుడు కూడా రీఛార్జ్ చేసుకోకపోతే 90 రోజుల తరువాత కనెక్షన్ ను తాత్కాలికంగా నిలిపివేయడం.. అలాగే క్రమంగా సిమ్ లాక్ అయిపోయే ప్రమాదం ఉందని చెప్పకనే చెబుతున్నాయి. 

Similar News