ఒడిశా, ఏపీలకు వాతావరణం శాఖ హెచ్చరిక

Update: 2018-08-19 07:02 GMT

ఒడిశా, ఏపీలకు వాతావరణం శాఖ హెచ్చరికలు జారీచేసింది. నైరుతి రుతుపవనాలు ఉత్తరాది నుంచి వెనక్కు రావడం మొదలైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా, ఏపీపై నైరుతి రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్పారు. నేడు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో మంచి వర్ష పాతం నమోదవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ బంగ్లా-ఒడిశా తీరాలకు ఆనుకుని 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడతాయన్నారు.

Similar News