దాతీ మహారాజ్ ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు మాయం.. పరారీలో స్వామిజి!

Update: 2018-06-17 08:09 GMT

రాజస్థాన్‌లోని అల్వాస్‌లో ఆశ్రమాన్ని నిర్వహిస్తూ, తనను తాను దైవాంశ సంబోధుడుగా  చెప్పుకునే దాతీ మహారాజ్.. ఆరాచకాలు  బయటకు వస్తున్నాయి. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా ఆశ్రమం నుంచి దాదాపు 700 మందికిపైగా అమ్మాయిలు  అదృశ్యం అయినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆశ్రమం నుంచి కనిపించని వారంతా ఎక్కడికి వెళ్లారన్న విషయాన్ని నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగారు.

దాతీ మహారాజ్ ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి ఆలనా పాలనా తానే చూసుకుంటున్నానని గతంలో ఎన్నోసార్లు చెప్పుకునేవాడు. అయితే ఇటీవల తనను అత్యాచారం చేశాడని 25 సంవత్సరాల యువతి చేసిన ఫిర్యాదుపై విచారించేందుకు ఆశ్రమానికి వెళ్లిన పోలీసులకు అక్కడ 100 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించినట్టు తెలుస్తోంది.  మిగిలిన అమ్మాయిలంతా ఎక్కడికి వెళ్లారన్న విషమమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్‌ కోసం పోలీసులు పోలీసులు జల్లెడ పడుతున్నారు.

Similar News