రూ.2000,200 ల నోట్లపై పిడుగులాంటి వార్త!

Update: 2018-06-20 12:35 GMT

ఇప్పటికే పెద్దనోట్లకు చిల్లర దొరక్క సతమతమవుతున్న ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. పొరపాటున, చిరిగినా, పాడైపోయిన నోట్లను బ్యాంకులు తీసుకుని తిరిగి వేరే నోట్లను ఇస్తున్నాయి. అయితే ఇందుకోసం కొంత కమిషన్ తీసుకుంటున్నారు.కానీ ఇటీవల అందుబాటులోకి వచ్చిన రూ.2000,200 వచ్చిన నోట్లపై ఆర్బీఐ ఎటువంటి మార్గదర్శకాలు నిర్ధేశించలేదు. దీంతో చిరిగిన రూ.2000,200 నోట్లను తీసుకోవడం లేదనే అభిప్రాయం ప్రజల్లో  వ్యక్తమవుతోంది. వాస్తవానికి చిరిగిపోయిన నోట్లకు కొంత విలువ కట్టి వాటి స్థానంలో వేరేవి ఇవ్వాలని  గతంలోనే ఆర్‌బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ రూ.2000, రూ.200 నోట్లకు మాత్రం ఎటువంటి మార్గదర్శకాలు వెలువడక పోవడం గమనార్హం.

Similar News