Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి..3 సబ్ స్క్రిప్షన్లు..ఒక లిస్టింగ్
Upcoming IPOs: వచ్చేవారమంతా స్టాక్ మార్కెట్లో ఐపీఓలు సందడి చేయనున్నాయి.
Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి..3 సబ్ స్క్రిప్షన్లు..ఒక లిస్టింగ్
Upcoming IPOs: వచ్చేవారమంతా స్టాక్ మార్కెట్లో ఐపీఓలు సందడి చేయనున్నాయి. నిధులు సమీకరించేందుకు వచ్చే వారం మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. ఈ మూడు సంస్థలు ఎస్ఎంఈ విభాగం నుంచే రానున్నాయి. ఇక ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న ఓ కంపెనీ వచ్చే వారంలో లిస్ట్ కానుంది. గత నెలలో ఏడు కంపెనీలు మెయిన్ బోర్డ్ లిస్టింగ్స్ రాగా..వచ్చే వారంలో ప్రధాన బోర్డు నుంచి ఒక ఐపీఓ కూడా రాలేదు.
ఎస్ఎంఈ విభాగం నుంచి సచీరోయ్ లిమిటెడ్ ఐపీఓకు రానుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా మొత్తం రూ. 61.62కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ సబ్ స్క్రిప్షన్ జూన్ 9న ప్రారంభమై 11వ తేదీన ముగియనుంది. ఈ ప్రక్రియ మొత్తం తాజా షేర్ల జారీ ద్వారా నిర్వహించనుంది. 60.41 లక్షల షేర్లను జారీ చేయనుంది. ధరల శ్రేణి రూ. 96-102గా నిర్ణయించారు.
అల్యూమినియం వైర్ రాడ్స్ తయారీదారు సంస్థ అయిన జైనిక్ పవర్ అండ్ కేబుల్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 51.30కోట్లు సమీకరించేందుకు రెడీ అవుతోంది. ధరల శ్రేణి రూ. 100-110గా ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూ సబ్ స్క్రిప్షన్ జూన్ 10న ప్రారంభమైంది. 12వ తేదీతో ముగుస్తుంది. ఇష్యూలో భాగంగా 46.63లక్షల తాజా షేర్లు జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి తాజా పేరు జారీ ద్వారా జరగనుంది.
రూ. 82.02కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఎస్ఎంఈ విభాగం నుంచి మోనోలిథిష్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఐపీఓలో భాగంగా 57. 36లక్షల షేర్ జారీ చేయనుంది. సబ్ స్క్రిప్షన్ జూన్ 12వ తేదీన ప్రారంభమై 16వ తేదీన ముగుస్తుంది. ధరల శ్రేణి రూ. 135-143గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్ నుంచి నిధుల సమీకరణ పూర్తి చేసుకన్న గంగబాత్ ఫిట్టింగ్ కంపెనీ షేర్లు జూన్ 11న స్టాక్ మార్కెట్లో లిస్టు కానున్నాయి.