Ayushman Bharath: ఆయుష్మాన్‌ భారత్‌ బీమా కింద ఈ ఆరోగ్య చికిత్సలు పొందలేరు..

Ayushman Bharath: ఆయుష్మాన్‌ భారత్‌ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య చికిత్సపరంగా లబ్ది పొందుతారు. అయితే, ఆయుష్మాన్‌ భారత్‌ బీమా కింద కొన్ని చికిత్సలు వర్తించవు. అవి ఏంటో తెలుసుకుందాం.

Update: 2025-04-15 09:07 GMT

Ayushman Bharath: ఆయుష్మాన్‌ భారత్‌ బీమా కింద ఈ ఆరోగ్య చికిత్సలు పొందలేరు..

Ayushman Bharath: ఆయుష్మాన్ భారత్‌ కింద రూ.5 లక్షల వరకు చికిత్స ఉచితంగా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఈ పథకం పేద, మధ్య తరగతి కుటుంబాలకు 70 ఏళ్లు పైబడిన వారికి కూడా చికిత్స ఉచితం అందిస్తోంది. అయితే, ఈ పథకం కింద కొన్ని చికిత్సలు వర్తించవు అవేంటో తెలుసుకుందాం..

దేశంలో ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రధానంగా రూ.5 లక్షల వరకు కవరేజీ వస్తుంది. ఇది పేద మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తోంది. ఇది కొన్ని కోట్ల మంది భారతీయులకు లబ్ది అందిస్తుంది. అయితే కొన్ని చికిత్సలు మాత్రం ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు.

ప్రధానంగా మీరు ఆసుపత్రిలో చెకప్‌లు చేయించుకున్నప్పుడు ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వర్తించదు. అంతేకాదు జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ చికిత్సలకు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే ఓపీడీ వర్తించదు..

ఇది మాత్రమే కాదు డెంటల్‌ చికిత్సలు కూడా వర్తించవు. పంటికి సంబంధిత చికిత్సలు కాస్మోటాలజీ కిందకు వస్తాయి కాబట్టి డెంటల్‌ చికిత్సలు ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి రావు.

మరికొన్ని కాస్మోటిక్‌ సర్జరీలు, ఫెర్టిలిటీకి సంబంధించిన చికిత్సలు, టీకా వంటివి కూడా ఈ పథకం కిందకు రావు. ఆయుష్మాన్ కార్డు గురించి తెలుసుకోవడానికి మీరు ఈ పథకానికి సంబంధించిన వివరాలు అధికారిక వెబ్‌సైట్ https://pmjay.gov.in/ ని సందర్శించాలి. ఈ పథకం ఏ ఆసుపత్రిలో వర్తిస్తుందో కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఇందులో 'Find hospitals' క్లిక్‌ చేసి సెర్చ్‌ చేయాలి.

Tags:    

Similar News