Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..దిగి వస్తున్న బంగారం ధర..నేటి ధరలు ఇలా
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ..తాజా ధరలు ఇవే
Today Gold Rate: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. వరుసగా 5వ రోజు బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి. నేడు మార్చి 3వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలో బంగారం ధరలు నేడు మార్చి 3వ తేదీ సోమవారం స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల బంగారం పది గ్రాము ధర రూ. 10 దిగివచ్చింది. దీంతో రూ. 86,610వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 86,620గా ఉంది. అదే సమయంలో వంద గ్రాముల బంగారం ధర రూ. 100 దిగివచ్చింది. రూ. 8,66,100గా ఉంది. గ్రాము పసిడి ధర రూ. 8,661గా ఉంది.
దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధరరూ. 79,540గాను..24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,760గా పలుకుతోంది. కోల్ కతాలో ప్రస్తుతం 22క్యారెట్ల బంగారం ధరరూ. 79, 390 పలుకుతోంది. 24క్యారెట్ల బంగారం 86,610గా ఉంది. ముంబై, కేరళ, పుణెలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79, 390గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,61గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
దేశంలో వెండి ధరలు కూడా సోమవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి 100 రూపాయలు తగ్గి 96,900వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర ర. 97, 000గా ఉంది.