Gold Rate: బంగారం కొనాలనుకుంటున్నారా ? ఇదే సువర్ణ అవకాశం..గోల్డ్ రేట్ ఎంతంటే?

Gold Rate:బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2021-05-03 01:25 GMT

Gold Rate

Gold Rate: బంగారం ధరలు సోమవారం మార్పులు లేకుండా ఉన్నాయి. దీంతో నిన్న‌టి మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు నిన్న‌టి ప్రారంభ ధరలతో పోలిస్తే కదలిక లేకుండా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు (03.05.2021) మార్పులు లేవు. మరో వైపు వెండి ధరలు కొద్దిగా పెరుగుదల కనబరిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. సోమ‌వారం (03.05.2021) బంగారం ధరలు శ‌నివారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 43,800 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 47వేలరూపాయల మార్క్ కి కొద్దిగా ఎగువన 47,780 రూపాయలుగా నిలిచింది.

స్థిరంగా వెండి ధ‌ర‌లు

బంగారం ధరలు స్థిరంగా ఉంటె.. వెండి ధరలు కూడా స్థిరంగా కొన‌సాగుతున్నాయి. కేజీ వెండి ధర ఆదివారం ప్రారంభ ధర కంటె పెరుగుద‌ల న‌మోదు చేసుకోలేదు. దీంతో 72 వేల రూపాయల స్థాయిలోనే వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 72,800 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. సోమ‌వారం (03.05.2021) బంగారం ధరలు నిన్న‌టి ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 43,800 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 47వేలరూపాయల మార్క్ వ‌ద్ద కొన‌సాగుతుంది. దీంతో 47,780 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆదివారం నాటి ప్రారంభ ధర 45,370 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్న‌టి ప్రారంభ ధర 47,780 రూపాయల వద్ద ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర శ‌నివారం నాటి ప్రారంభ వ‌ద్దే కొన‌సాగుతుంది. ఢిల్లీలో వెండి ధ‌ర‌లు 67 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,500 రూపాయలుగా నమోదు అయింది. హైద‌రాబాద్ తో పోలిస్తే ఢిల్లీలో వెండి ధ‌ర‌లు 5వేల రూపాయ‌ల త‌క్కువ‌గా ఉన్నాయి.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News