Indian Railways: ఇండియాలోని ఈ రైల్వేస్టేషన్లు రుచికరమైన ఆహారాలకి ఫేమస్‌.. అవేంటంటే..?

Indian Railways: ఇండియాలోని ఈ రైల్వేస్టేషన్లు రుచికరమైన ఆహారాలకి ఫేమస్‌.. అవేంటంటే..?

Update: 2023-01-22 04:30 GMT

Indian Railways: ఇండియాలోని ఈ రైల్వేస్టేషన్లు రుచికరమైన ఆహారాలకి ఫేమస్‌.. అవేంటంటే..?

Indian Railways: ప్రయాణంలో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించకుంటే ఆ యాత్ర అసంపూర్తిగా ఉంటుంది. భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలే కాదు ఇక్కడి రైల్వే స్టేషన్లు కూడా కొన్ని రకాల ఆహారాలకి ఫేమస్‌. సాధారణంగా ప్రతి ఒక్కరూ ట్రావెలింగ్‌లో స్ట్రీట్ ఫుడ్ లేదా లోకల్ ఫుడ్‌ని ప్రయత్నించడానికి ఇష్టపడతారు. స్ట్రీట్ ఫుడ్ భారతదేశంలో ప్రతిచోటా ప్రసిద్ధి చెందింది. అలాగే కొన్ని రైల్వేస్టేషన్లలో కూడా ఫేమస్‌. అలాంటి రైల్వేస్టేషన్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ముంబై సెంట్రల్ : ఇది భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ప్రతి 2 నిమిషాలకు ఒక రైలు వస్తూ పోతూ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ వడ పావ్, పావ్ భాజీ, భేల్పురిలకు ప్రసిద్ధి చెందింది. ప్రయాణికుల నుంచి స్థానికుల వరకు ఇక్కడి ఆహారాన్ని ఖచ్చితంగా రుచి చూస్తారు.

అల్వార్ మిల్క్ కేక్ : రాజస్థాన్‌లోని అల్వార్ దగ్గర లభించే మిల్క్ కేక్ కోసం పర్యాటకులు స్థానికులు క్యూ కడుతారు. అల్వార్ స్టేషన్‌కు వచ్చేవారు ఇక్కడి నుంచి మిల్క్ కేక్ స్వీట్లను తీసుకెళ్లడం అస్సలు మర్చిపోరు. దీనిని ఒక్కసారి తిన్నారంటే అస్సలు మరిచిపోరు. మళ్లీ మళ్లీ తినాలని కోరుకుంటారు.

జైపూర్ స్ట్రీట్‌ ఫుడ్‌: 'పింక్ సిటీ' జైపూర్ రాజస్థాన్ రాజధాని. భారతీయ సంస్కృతి గురించి తెలియాలంటే జైపూర్‌ని సందర్శించాల్సిందే. ఇక్కడి రైల్వే స్టేషన్‌లో స్థానిక ఆహారం దాల్-బాటి చుర్మాని అందరు ఇష్టపడుతారు. పర్యాటకులు కచ్చితంగా రుచి చూస్తారు.

సురేంద్రనగర్ జంక్షన్ టీ : మీరు గుజరాత్‌లోని సురేంద్రనగర్ జంక్షన్ గుండా వెళుతున్నట్లయితే ఇక్కడ రైల్వే స్టేషన్‌లో లభించే ఒంటె టీని తప్పకుండా తాగాల్సిందే. ప్రయాణికులే కాకుండా స్థానికులు కూడా స్టేషన్‌కు వచ్చి ఈ టీ తాగుతుంటారు.

Tags:    

Similar News