Ayushman Yojana: ఆయుష్మాన్ భారత్ స్కీం కింద ఈ వ్యాధులకు చికిత్స చేయరు.. ఎందుకంటే..?
Ayushman Yojana: పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందులో ఒకటి ఆయుష్మాన్ యోజన స్కీం.
Ayushman Yojana: ఆయుష్మాన్ భారత్ స్కీం కింద ఈ వ్యాధులకు చికిత్స చేయరు.. ఎందుకంటే..?
Ayushman Yojana: పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందులో ఒకటి ఆయుష్మాన్ యోజన స్కీం. దీనిని కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. దీని వల్ల చాలా మంది నిరుపేదలు లబ్ధిపొందారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆయుష్మాన్ కార్డ్ ఇస్తారు. దీని ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కొన్ని వ్యాధులకు చికిత్స చేయడం సాధ్యం కాదు. ఆ వ్యాధులను ప్రభుత్వం వెల్లడించింది. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఈ వ్యాధులు జాబితా నుంచి తొలగించారు
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద 1760 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 196 వ్యాధులను చికిత్స జాబితా నుంచి తొలగించి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. వీటిలో మలేరియా, కంటిశుక్లం, సర్జికల్ డెలివరీ, స్టెరిలైజేషన్, గ్యాంగ్రీన్ వంటి 196 వ్యాధులు ఉన్నాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యవల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ వ్యాధులకు చికిత్స పొందేందుకు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు బదులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేవారు. ఎందుకంటే అక్కడ మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కష్టాలను మరింత పెంచింది.
కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది
ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి ప్రభుత్వం ఈ వ్యాధులను తొలగించినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాధులకు చికిత్స కొనసాగుతుంది. ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్ ఎవరైనా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఈ వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందవచ్చు.