Old Age Schemes: ఈ 5 స్కీమ్‌లు వృద్ధాప్యంలో ఆదుకుంటాయి.. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా ఆదాయం..!

Old Age Schemes: 60 ఏళ్ల తర్వాత ఏ పని చేయలేరు కాబట్టి రెగ్యూలర్‌ ఇన్‌కమ్‌ ఉండదు. దీంతో రోజువారీ ఖర్చులు భారంగా మారుతాయి.

Update: 2023-09-11 13:03 GMT

Old Age Schemes: ఈ 5 స్కీమ్‌లు వృద్ధాప్యంలో ఆదుకుంటాయి.. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా ఆదాయం..!

Old Age Schemes: 60 ఏళ్ల తర్వాత ఏ పని చేయలేరు కాబట్టి రెగ్యూలర్‌ ఇన్‌కమ్‌ ఉండదు. దీంతో రోజువారీ ఖర్చులు భారంగా మారుతాయి. అందుకే ఉద్యోగ సమయంలోనే రిటైర్మెంట్‌ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల వృద్ధాప్యంలో హాయిగా బతకవచ్చు. లేదంటే ఎవరో ఒకరిపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్కెట్లో వివిధ రకాలపెన్షన్ పథకాలు అమలులో ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల వృద్ధాప్యంలో అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. అలాంటి కొన్ని స్కీమ్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్

ఈ స్కీమ్‌ 60 ఏళ్లు పైబడిన వారి కోసం ప్రారంభించారు. ఇది ఒక రకమైన పొదుపు పథకం. ఇందులో పెట్టుబడి పెడితే వడ్డీతో పాటు మంచి రాబడి లభిస్తుంది. కావాలంటే ఒకేసారి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాన్ని POMIS అని కూడా పిలుస్తారు. ఇది చిన్న పొదుపు పథకం. ఇందులో ఐదేళ్ల పాటు మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ ఖాతాలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.9 లక్షలు ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని FD అని అంటారు. వృద్ధులు ఎఫ్‌డీ రూపంలో పెట్టుబడి పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు 0.50 శాతం ప్రత్యేక వడ్డీని అందిస్తాయి. వీటిపై వచ్చే వడ్డీని నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షికంగా చెల్లిస్తారు.

మ్యూచువల్ ఫండ్

సీనియర్ సిటిజన్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కొంత కాలం తర్వాత మంచి రాబడిని పొందుతారు. సాధారణంగా వీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ మార్కెట్ రిస్క్‌లకి లోబడి ఉంటాయి. అయితే పొదుపులో కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని పొందవచ్చు.

ఆర్‌బిఐ సేవింగ్స్ బాండ్‌లు

ఆర్‌బిఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్‌లపై వడ్డీ రేటు ఎన్‌ఎస్‌సిపై వడ్డీ రేటు కంటే 0.35% ఎక్కువగా ఉంటుది. ఈ బాండ్లలో కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. బాండ్ కాలవ్యవధి ఏడు సంవత్సరాలు. 60 ఏళ్లు పైబడిన వారు ఇందులో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది.

Tags:    

Similar News