Income Tax: ఈ ఐదు దేశాలలో ఇన్‌కమ్‌టాక్స్ ఉండదు.. ఎలాంటి పన్నులు ఉండవు..!
Income Tax: 1 ఫిబ్రవరి 2023న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
Income Tax: ఈ ఐదు దేశాలలో ఇన్‌కమ్‌టాక్స్ ఉండదు.. ఎలాంటి పన్నులు ఉండవు..!
Income Tax: 1 ఫిబ్రవరి 2023న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే ఈసారి కూడా ఆదాయపు పన్ను మినహాయింపు పొందడంపై మధ్యతరగతి ప్రజల దృష్టి నెలకొని ఉంది. రైతులతో పాటు ఉపాధి కూలీలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భారతదేశంలో ఉండే ఆదాయపు పన్ను విధానం గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించని 5 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
సౌదీ అరేబియాలో జీరో ట్యాక్స్
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు దేశం. ఈ దేశపు చమురు వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. అందుకే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా పౌరుల నుంచి ప్రభుత్వం ఆదాయపు పన్ను తీసుకోదు. కానీ సామాజిక భద్రత చెల్లింపులు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటాయి.
ఖతార్‌లో ఆదాయపు పన్ను వర్తించదు
ఖతార్ కూడా సంపన్న దేశాలలో ఒకటి. ఇక్కడి ప్రభుత్వం పౌరుల నుంచి ఎలాంటి పన్ను తీసుకోదు. ఇక్కడ మూలధన లాభాలు, డబ్బు లేదా ఆస్తి బదిలీ విషయంలో ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఖతార్‌లో చమురు నిల్వలు మెండుగా ఉన్నాయి.
ఒమన్ పన్ను రహిత వ్యవస్థ
ఒమన్ ప్రపంచంలోని ధనిక దేశాలలో ఒకటి. ఇక్కడ చమురు నిల్వలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఒమన్ ప్రభుత్వం తన పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోవడానికి ఇదే కారణం. ఇక్కడ పన్ను విధానం లేకపోవడం వల్ల పౌరులు చాలా ఉపశమనం పొందుతారు.
కువైట్‌లో ఆదాయపు పన్ను విధానం లేదు
కువైట్‌లో ఆదాయపు పన్ను విధానం లేదు. ఇక్కడ ప్రభుత్వం ఆదాయపు పన్ను పేరుతో ఏ దేశస్థుడి నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయదు. పౌరులు ఖచ్చితంగా ఆదాయపు పన్ను నుంచి విముక్తి పొందుతారు. అయితే ప్రతి దేశస్థుడు సామాజిక బీమాకు సహకరించడం అవసరం.
బెర్ముడా
బెర్ముడా చాలా చిన్న దేశం. ఇక్కడ ప్రభుత్వం వేతన తరగతిపై 14 శాతం పే రోల్ పన్ను విధిస్తుంది. పేరోల్ పన్ను మినహాయించి ఏ పౌరుడిపైనా ఆదాయపు పన్ను విధించదు.