Heritage: ఒక్కరోజులోనే ఆవిరైన నారా కుటుంబ సంపద

Heritage: ఏపీ ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ విషయంలో అదే జరిగింది. క్యూ3 ఫలితాల ఎఫెక్ట్ ఆ కంపెనీ షేర్లపై నెగటివ్ ప్రభావాన్ని చూపింది.

Update: 2026-01-30 04:25 GMT

Heritage: ఒక్కరోజులోనే ఆవిరైన నారా కుటుంబ సంపద

Heritage: స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు సహజమే అయినా, కొన్నిసార్లు దిగ్గజ సంస్థల షేర్లు కుప్పకూలినప్పుడు ఆ వార్త సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ విషయంలో అదే జరిగింది. క్యూ3 ఫలితాల ఎఫెక్ట్ ఆ కంపెనీ షేర్లపై నెగటివ్ ప్రభావాన్ని చూపింది.

ఒక్కరోజులోనే ఆవిరైన నారా కుటుంబ సంపద

భారత స్టాక్ మార్కెట్లలో గురువారం 'రెడ్ సిగ్నల్' కనిపించింది. ఒకవైపు భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో మార్కెట్లు కళకళలాడుతాయని భావించినా, ఆ సంతోషం రెండు రోజుల మురిపెమే అయిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడవుతుండగా.. అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల పతనం.ఏపీ సీఎం నారా చంద్రబాబు స్థాపించిన ఈ డెయిరీ దిగ్గజం, గురువారం సెషన్‌లో ఇన్వెస్టర్లకు గట్టి షాక్ ఇచ్చింది. బుధవారం రూ. 396.65 వద్ద ముగిసిన షేరు, నేడు నేరుగా 7 శాతం నష్టంతో రూ. 368 వద్ద ఓపెన్ అయింది.

అంతటితో ఆగకుండా ఇంట్రాడేలో ఏకంగా 10 శాతం వరకు పతనమై రూ. 358.20 వద్ద 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరువలో నిలిచింది.స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడూ ఫలితాలే రాజమార్గం. హెరిటేజ్ ఫుడ్స్ తాజాగా ప్రకటించిన మూడో త్రైమాసికం (Q3) ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి.సంస్థ నికర లాభం ఏకంగా 20 శాతం తగ్గి రూ. 34.5 కోట్లుగా నమోదైంది.ఆదాయం 8.2 శాతం పెరిగినప్పటికీ, లాభదాయకత తగ్గడంతో మార్కెట్ వర్గాలు అమ్మకాలకు మొగ్గు చూపాయి.

నారా కుటుంబానికి కోట్లలో నష్టం

హెరిటేజ్ ఫుడ్స్ షేరు పడటం అంటే అది కేవలం సామాన్య ఇన్వెస్టర్లకే కాదు, ప్రమోటర్లుగా ఉన్న నారా కుటుంబానికి కూడా కోలుకోలేని దెబ్బ. అధికారిక లెక్కల ప్రకారం.. చంద్రబాబుకి ఇందులో వాటా లేనప్పటికీ, ఆయన కుటుంబ సభ్యుల సంపద ఒక్కరోజులోనే భారీగా తగ్గింది. సంస్థ వైస్ ఛైర్‌పర్సన్ , ఎండీగా ఉన్న నారా భువనేశ్వరికు 24.37 శాతం వాటా ఉంది. షేరు పతనంతో ఆమె సంపద ఒక్కరోజే రూ. 86 కోట్లకు పైగా ఆవిరైపోయింది.10.82 శాతం వాటా కలిగిన లోకేష్ సంపద రూ. 38 కోట్లకు పైగా తగ్గింది.నారా బ్రాహ్మణికి సుమారు రూ. 16 లక్షల వరకు నష్టం వాటిల్లింది.చిన్నారి దేవాన్ష్ పేరిట ఉన్న షేర్ల విలువ కూడా రూ. 21 లక్షలకు పైగా పడిపోయింది.

ఒకవైపు రాజకీయంగా హెరిటేజ్ బ్రాండ్ దూసుకుపోతున్నా, స్టాక్ మార్కెట్ లెక్కలు మాత్రం కేవలం లాభనష్టాల మీదే ఆధారపడి ఉంటాయని ఈ పతనం మరోసారి నిరూపించింది. 52 వారాల గరిష్ఠం (రూ. 540) నుంచి చూస్తే ఈ షేరు ఇప్పటికే 35 శాతం మేర విలువ కోల్పోయింది. ఫలితాల ఒత్తిడి తగ్గాక మళ్ళీ పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News